VIDEO: రాజంపేటలో మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేత

VIDEO: రాజంపేటలో మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేత

అన్నమయ్య: ప్రాజెక్టు నుంచి రాజంపేట పట్టణానికి నీటిని సరఫరా చేసే పైపులైన్లు దెబ్బతినడంతో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు గురువారం సాయంత్రం తెలిపారు. ఈ కారణంగా ఇవాళ నుంచి మూడు రోజుల పాటు పట్టణానికి నీటి సరఫరా నిలిచిపోతుందని ఆయన స్పష్టం చేశారు. పరిసర గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని కమిషనర్ తెలిపారు.