మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
E.G: అనపర్తి మండలం కుతుకులూరులో జలజీవన్ మిషన్ నిధులు రూ14.3కోట్లతో చేపట్టనున్న అమరజీవి జలదార తాగు నీటి సరఫరా ప్రాజెక్టు పనులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మంచినీటిని అందించి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఆలోచనతో కేంద్రం జల జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.