వెన్న అలంకారంతో దర్శనమిచ్చిన శనేశ్వర స్వామి

వెన్న అలంకారంతో దర్శనమిచ్చిన శనేశ్వర స్వామి

CTR: పుంగనూరు యాభై రాళ్ల మరవ వద్ద వెలసిన శ్రీ శనేశ్వరస్వామికి శ్రావణ మాసం రెండో శనివారం సందర్భంగా శని భగవానుని ఉదయం అర్చకులు అభిషేకించి, ద్రాక్ష జీడిపప్పు వెన్నతో అలంకారం చేశారు. అనంతరం భక్తులు దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. శనేశ్వర నామస్మరణలతో ఆలయ ప్రదక్షిణలు చేసి భక్తిశ్రద్ధలతో నువ్వుల దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాద పంపిణీ చేశారు.