అడ్డతీగలలో రద్దయిన మద్యం షాపునకు దరఖాస్తుల ఆహ్వానం
ASR: అడ్డతీగలలో గతంలో రద్దయిన మద్యం షాపునకు తిరిగి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీధర్ తెలిపారు. ఆసక్తి గలవారు రూ. 2 లక్షల (నాన్-రీఫండబుల్) ఫీజుతో ఈ నెల 21న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 23న అల్లూరి జిల్లా కలెక్టరేట్‌లో జరిగే లాటరీ ద్వారా షాపు కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.