VIDEO: 'పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారు'

RR: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్సార్ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వైఎస్సార్ అందించిన సేవలు నేటికీ ప్రజల స్మృతిలో నిలిచాయని, నిరుపేద కుటుంబాలకు ప్రాణదాతగా నిలిచారన్నారు.