'ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యం'
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వర రావు అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు 'జనతా వారధి' అనే కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.