టీమిండియాను అభినందించిన ప్రధాని, రాష్ట్రపతి

టీమిండియాను అభినందించిన ప్రధాని, రాష్ట్రపతి

టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసించారు. ప్రపంచకప్ విజయం సమిష్టి కృషిని ప్రతిబింబిస్తుందని కొనియాడారు. ఈ విజయంతో ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపిందని పేర్కొన్నారు. మరో వైపు విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాను రాష్ట్రపతి ముర్ము కూడా అభినందించారు.