కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

GNTR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సోమవారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 0863 2234014 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.