అలసత్వంపై కార్యకర్తల ఆగ్రహం..
NLG: జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మండలానికి 1 లేదా 2 కేంద్రాలకు మాత్రమే స్మార్ట్‌ఫోన్లు అందాయని, మిగిలినవి కార్యాలయాల గోడౌన్లలోనే పడి ఉన్నాయని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు మండిపడుతున్నారు. పై అధికారులు స్పందించి ఫోన్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు.