ముందుకు వచ్చిన యువత బాగుపడిన పాఠశాల

ముందుకు వచ్చిన యువత బాగుపడిన పాఠశాల

VZM: గజపతినగరం మండలంలోని బూడిపేట గ్రామంలో గల యువత చేయి చేయి కలిపి శిధిలమైన పాఠశాలను బాగు చేయించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మూతపడడానికి సిద్ధంగా ఉన్న సమయంలో యువత ముందుకు వచ్చి రూ.52,000 ఖర్చుతో పాఠశాలను బాగు చేయించి సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే స్కూల్లో నలుగురు విద్యార్థులు ఉండగా ఈ ఏడాది మరో పదకొండు మంది విద్యార్థులను చేర్పించారు.