గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

MDK: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఇన్‌స్పెక్టర్ మహేశ్ వివరాల మేరకు.. టౌన్‌లోని జీకేఆర్ గార్డెన్స్ ముందు సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉన్నాడని, చామనఛాయ రంగులో ఉన్న ఆ వ్యక్తి బ్లూ కలర్ టీ షర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని గుర్తుపడితే 87126 57878, 87126 57913 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.