కోడుమూరులో ఘనంగా వినాయక నిమజ్జనం

KRNL: కోడుమూరు పట్టణంలో వినాయక నిమజ్జనం సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యింది. మూడు రోజులగా పూజలందుకున్న విగ్రహాలను నిమజ్జనం గావించారు. ఈ సందర్భంగా విగ్రహాలను వాహనంపై కొలువుంచి పట్టణ వీధుల్లో ఊరేగింపుగా తరలించారు. విగ్రహాల శోభాయాత్రను తిలకించేందుకు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. యువకులు, చిన్నారులు చిందులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.