'సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలి'
AKP: కోటవురట్ల శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన 66 మంది ఎస్సీ, బీసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కోటవురట్ల రెవిన్యూ పరిధిలో 33 ఎకరాల్లో జీడి తోటలు సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు.