ఘనంగా స్కూల్ వార్షికోత్సవ క్రీడా వేడుకలు
NLR: కందుకూరులోని BR ఆక్స్‌ఫోర్డ్ స్కూల్ 12వ వార్షికోత్సవ క్రీడా వేడుకలను ఎమ్మెల్యే నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. చదువుతో పాటు పిల్లలకు క్రీడలు, మానసిక ఉల్లాసం చాలా ముఖ్యమని, స్కూల్ మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సంస్థను ఒక గొప్ప ఆశయంతో స్థాపించామని ఛైర్మన్ ఉన్నం భాస్కరరావు ఈ సందర్భంగా తెలిపారు.