విద్యార్థి అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు

విద్యార్థి అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు

ATP: గుత్తి పట్టణంలోని కటిక బజార్లో నివాసం ఉండే నిర్మల, కుమార్ దంపతుల కుమారుడు వర్షిత్ బుధవారం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోకి వచ్చిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వర్షిత్ గుత్తిలో ని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాట్లు పోలీసులు తెలిపారు.