నేటి నుంచి విజయ్ ఎన్నికల ప్రచారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో TVK అధినేత, నటుడు విజయ్ నేటి నుంచి తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులందరినీ ఖరారు చేసిన విజయ్, తాను పోటీ చేస్తున్న పెరంబూరు నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, చెన్నై నగరంలోని పెరంబూరుతో పాటు ఐదు కీలక ప్రాంతాల్లో విజయ్ రోడ్ షోలు నిర్వహించనున్నారు.