గోదావరి వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహారణ

గోదావరి వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహారణ

BDK: భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం గోదావరి వరద 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక, అదేరోజు సాయంత్రం 48 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.బుధవారం వరకు ఉదృతంగా ప్రవహించిన గోదావరి 50.6అడుగులకు చేరి తగ్గుముఖం పట్టింది. గురువారం గోదావరి వరద 42.7 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు.