దువ్వలో ఉచిత వైద్య శిబిరం

W.G: తణుకు మండలం దువ్వ 1 గ్రామంలో సోమవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురు వృద్ధులు, గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పీహెచ్ ఎన్.విజయలక్ష్మి, డీఈవో సాయిరాం వెంకటేశ్, ఎంపీహెచ్ ఏ.వెంకట్రావు, ఏఎన్ఎం లక్ష్మి, సూర్యకుమారి, పైలట్ ఆనంద్, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.