'ఏడాదిలోగా అందుబాటులోకి కొత్త టోల్ వ్యవస్థ'

'ఏడాదిలోగా అందుబాటులోకి కొత్త టోల్ వ్యవస్థ'

దేశవ్యాప్తంగా ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం ద్వారా టోల్‌ఫీజు వసూలుకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా టోల్ గేట్ల వద్ద ఆగకుండానే వెళ్లొచ్చన్నారు. ఇప్పటికే 10 చోట్ల ఇలాంటి టోల్ వ్యవస్థ ఉందని చెప్పారు. ఈ మేరకు టోల్ వ్యవస్థ వివరాలను లోక్‌సభలో గడ్కరీ వెల్లడించారు.