గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత
MDK: నర్సాపూర్‌లోని మైనార్టీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పాఠశాల కాపలాదారు విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, ఆ తర్వాత మరో 15 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని ఆర్‌ఎంవో రాజేశ్ చెప్పారు.