ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు
KDP: మైలవరం జలాశయంలో ఆదివారం ఆత్మహత్యకు యత్నించిన సుబ్బలక్ష్మి అనే మహిళను పోలీసులు కాపాడారు. ఆనకట్టపై అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను చూసిన స్థానికులు SI శ్యామ్ సుందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన కానిస్టేబుళ్లు కుమార్, రమేశ్‌లను పంపించి మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి భర్త, కుమారుడికి అప్పగించారు.