ప్రశాంతంగా ముగిసిన ఆరు మున్సిపాలిటీల ఎన్నికలు: కలెక్టర్
BHNG: జిల్లాలో ఆరు మున్సిపాలిటీ ఎన్నికలు ఇవాళ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం ప్రశంసనీయమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో మీ సేవలు అమూల్యమైనవన్నారు.