VIDEO: అకస్మాత్తుగా 30 గొర్రెల మృత్యువాత
MNCL: కన్నేపల్లి మండలం మొక్కంపల్లిలో 30 గొర్రెలు అకస్మాత్తుగా మృతిచెందాయని స్థానికులు తెలిపారు. బుధవారం 15 గొర్రెలు, గురువారం మరో 15 గొర్రెలు మొత్తం 30 మృత్యువాత పడ్డాయని గొర్రెల కాపరులు తెలిపారు. అకస్మాత్తుగా గొర్రెలు చనిపోతుండటంపై పశు వైద్యులకు సమాచారం అందించి, కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.