మంత్రి అచ్చెన్నాయుడుని కలిసిన ఎంపీ
KRNL: మంత్రి అచ్చెన్నాయుడును కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు విజయవాడలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జిల్లాలో నిర్వహిస్తున్న ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాల ప్రగతి, వాటి ప్రభావం గురించి వివరించారు. అలాగే జిల్లా సమస్యలు, ప్రజల అభ్యర్థనలపై కూడా మంత్రితో సవివరంగా చర్చించారు.