VIDEO: బీసీ బాలికల హాస్టల్‌లో మున్సిపల్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

ప్రకాశం: కనిగిరిలోని బీసీ బాలికల హాస్టల్‌ను మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యతపై ఛైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. హాస్టల్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు.