పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ఎస్పీ

SRPT: పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం ఆత్మకూరు (ఎస్) మండలం గట్టికల్లులో తల్లి లక్ష్మి, తండ్రి రాములు మరణించగా ఒంటరిగా మిగిలిన ఇద్దరు పిల్లలను పరామర్శించారు. అనంతరం పిల్లలకు నిత్యావసరాలు, పాఠ్యపుస్తకాలు, నగదు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలన్నారు.