VIDEO: అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్లు పట్టివేత
MHBD: జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్లను ఇవాళ రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసి, తదుపరి చర్యల కోసం ట్రాక్టర్లను నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.