కెనాల్లో విద్యార్థి మృతదేహం లభ్యం
WGL: ఈనెల 5న ఈత కోసం కెనాల్లోకి వెళ్లి గల్లంతైన కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఫైనలియర్ విద్యార్థి భూక్య వాసు మృతదేహం నిన్న లభ్యమైంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యల అనంతరం గీసుకొండ మండలం మొగిలిచర్ల ప్రాంతంలోని కెనాల్లో శవాన్ని గుర్తించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేశారు.