భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త

భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త

కోనసీమ: భార్య‌పై అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టి భర్త చంపాలని చూసిన ఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. ఈదరపల్లి‌లో ఉంటున్న జంగా విజయ దుర్గా భవాని‌పై భర్త శివప్రసాద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి పెట్రోల్‌తో ఇంటికి నిప్పు పెట్టాడు. భార్య పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.