GOOD NEWS: రేపు అకౌంట్లలో నగదు జమ
TG: రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు పంట విక్రయం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు 55,904 మంది రైతుల ఖాతాల్లో రేపు రూ.588 కోట్లు జమకానున్నాయి. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 2.45 లక్షల టన్నుల మొక్కజొన్న సేకరణ పూర్తయింది.