VIDEO: ఆలయంలో వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ

కోనసీమ: వినాయక చవితి మహోత్సవాలను అందరూ పర్యావరణహితంగా జరుపుకోవాలని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఈవో అల్లు దుర్గా భవాని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులకు ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.