న్యాయవాదుల ఏకగ్రీవ నిర్ణయం.. మునిస్వామి అధ్యక్షుడు
PPM: పాలకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా పల్లా మునిస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా ఎం. వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా అల్లెన శివదాసు, సంయుక్త కార్యదర్శిగా వై. ప్రకాశ్, కోశాధికారిగా ఎం. జగన్మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన కార్యవర్గానికి సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.