జిల్లాలో గణనీయంగా పెరిగిన ఆముదం సాగు
ATP: జిల్లా వ్యాప్తంగా ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు వేరుశనగ సాగు తగ్గించి, కంది, మొక్కజొన్నతో పాటు ఆముదంపై దృష్టి సారించారు. గతంలో వందల ఎకరాలకు పరిమితమైన ఆముదం సాగు ఇప్పుడు వేలాది ఎకరాలకు చేరింది. ఈ ఖరీఫ్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 58 వేల ఎకరాల్లో ఆముదం సాగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.