VIDEO: బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
MDK: నర్సాపూర్ శివారులో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.యాదగిరిగుట్ట నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ శివారులోని మార్ట్ వద్ద ఒక్కసారిగా బస్సు ఇంజన్ లోంచి మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పి వేశారు. ఆసమయంలో 11మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు.