100 పాఠశాలలకు గ్రీన్ బోర్డుల పంపిణీ
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని 100 ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీన్ బోర్డులను ఎమ్మెల్యే సతీమణి సరిత గురువారం పాఠశాల నిర్వాహకులకు అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.