'నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
అన్నమయ్య: దిత్వా తుఫాను కారణంగా రెండు రోజులపాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుంజన నది పరివాహక ప్రాంతాలైన తోపు వీధి, బ్రాహ్మణ వీధి, గాజుల వీధి, పాత చిట్వేలు, కొత్త బస్టాండ్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిట్వేలు గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేయబడ్డాయన్నారు.