ఎలుగుబంటి సంచారం కలకలం

ఎలుగుబంటి సంచారం కలకలం

కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గేట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. కల్యాణి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం తునికాకు కోసం తిమ్మారెడ్డి శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్ళగా.. అక్కడ ఎలుగుబంటి కనిపించడంతో భయంతో వెనుదిరిగారు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు అడవిలోకి వెళ్లడానికి భయపడుతున్నారు.