'ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి'

'ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి'

కృష్ణా: ఉయ్యూరులోని శ్రీ విజయ సాయి స్కూల్ ప్రిన్సిపాల్ కనకలక్ష్మిపై చర్యలు తీసుకుని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని SFI డిమాండ్ చేసింది. షూ బదులుగా చెప్పులు వేసుకొచ్చాడనే కారణంతో పదో తరగతి విద్యార్థి వంశీకృష్ణ మెడలో చెప్పుల దండ వేయడం దారుణమని నాయకులు తెలిపారు. ఈ ఘటనపై జేసీ నవీన్‌కు సోమవారం PGRSలో మెమోరాండం అందజేశారు.