ఉపరాష్ట్రపతి ఎన్నికలో BRS ద్రోహం చేసింది: ఎంపీ

TG: BRSపై ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో BRS ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై CBI విచారణ జరుగుతున్నందునే BRS.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని ఆరోపించారు. గెలుపోటములు కేవలం రాజకీయ నెంబర్ మాత్రమే అని అభిప్రాయపడ్డారు. కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో BRS విఫలమైందని, ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు.