శ్రీశైలంలో భ్రమరాంబిక, మల్లికార్జున పల్లకి ఉత్సవాలు
NDL: శ్రీశైలం మహా క్షేత్రంలో ఆదివారం రాత్రి శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహా మంగళ హారతులు, నివేదన సమర్పణ తర్వాత పల్లకి ఉత్సవం జరిపారు.