ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం
KRNL: ఆదోనిలోని హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పత్తి, పత్తి చెక్కులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 5 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.