కొత్త కలెక్టరేట్ భవనం సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్
KNR: జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని సత్వరమే పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం భవన నిర్మాణ పనులను పరిశీలించి, ప్రధాన గేటు, విద్యుత్, పైపులైన్ల వంటి పెండింగ్ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ప్రారంభానికి సిద్ధం చేసేలా పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.