పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజలు వైసీపీ బెండు తీశారు: CBN

కడప: వైసీపీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమంలో CBN మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజలు ఆ పార్టీ బెండు తీశారని ఎద్దేవా చేశారు. పార్టీ ఆఫీసులు మూసి, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. హింసకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు.