VIDEO: ఏసీబీ చిక్కిన గూడూరు MEO, HM
MHBD: గూడూరు మండల ఇన్‌ఛార్జ్ MEO & అయోధ్యపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రంగేహస్తాల్లో పట్టుకున్నారు. వాగ్య తండాకు చెందిన ఉపాధ్యాయుడు రవీందర్ రిటైర్‌మెంట్ బెనిఫిట్ కోసం సంతకం చేయాలని అడిగినప్పుడు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. దీంతో అధికారులు దాడులు చేపట్టగా.. వారికి చిక్కారు.