'జిల్లా గ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పించాలి'

GDWL: జిల్లా గ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పించాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విద్యార్థి సంఘం నాయకులతో కలిసి గ్రంథాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా పాఠకులకు ఇబ్బందిగా మారిన టాయిలెట్లకు తాళాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.