స్వయంభు రాజేశ్వర స్వామికి మంత్రి పూజలు
SDPT: హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలో ఉన్న స్వయంభు రాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. పరాభవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.