మొగల్తూరులో ఏసీబీ అధికారులం అంటూ మోసం
W.G: మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు. ఏసీబీ రైడ్ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేయగా, అతను రూ.2 లక్షలు ఫోన్ పే చేశాడు. అనంతరం మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.