పుంగనూరులో ఉరుసు వేడుకలు ప్రారంభం
CTR: పుంగనూరు లో హజరత్ ఖాదరవల్లి బాబా వారి ఉరుసు వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక కుమ్మర వీధిలోని మదీనా మసీద్ లో మధ్యాహ్నం నమాజ్ తర్వాత మఖాన్ వద్ద చేరుకున్న ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు, దువ్వా చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 8.30 గంటల నుండి గంధం,ఫాతేహా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.