26నుంచి నరసింహ్మస్వామి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ్మస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి వచ్చే 6వ తేది వరకు జరుగుతాయని ఆలయ చైర్మన్ అచ్చుత శంకర్ రెడ్డి, ఈవో గోపి ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాలపై ఈ రోజు ఆర్డీవో అధ్యక్షతన సమీక్షా సమావేశం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరుకానున్నట్లు వెల్లడించారు.