రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు: బొత్స
AP: రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోయారని, రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ దృష్టంతా విశాఖ భూములపైనే ఉందన్నారు. ఎకరం రూ.99 పైసలకే భూములు కట్టబెట్టాలని చూస్తోందని విమర్శించారు.